DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. భూసంబంధిత సమస్యలు, పింఛన్లు, ఆదాయ ధృవపత్రాలు, గృహ నిర్మాణ పథకాలు తదితర అంశాలపై వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత శాఖాధికారులకు వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సమయానుకూలంగా న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు, విభాగాధిపతులు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
DNB News