DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో అబ్జర్వర్ కేశవరెడ్డితో కలిసి నాయకులు, కార్యకర్తలు స్వర్గీయ నందమూరి తారక రామరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆదోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి మానవతా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా టిడిపి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
DNB News