DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయం ఆక్రమణలు, అక్రమాల సమస్యపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతాపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ భూములపై జరుగుతున్న కబ్జాలు, అవినీతి చర్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు. ఆలయ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ సనాతన ధర్మం, దేవాలయాలు మరియు దేవి దేవుళ్ల జోలికి వెళ్లే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలో ఎమ్మిగనూరులోని శ్రీ కోతుల బావి దేవాలయాన్ని సందర్శిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు
Admin
DNB News