DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సు ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ఉద్దేశించి ప్రజలను చైతన్యపరిచేలా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “క్యాన్సర్ అనేది శాపం కాదు… నిర్లక్ష్యమే ప్రమాదం” అని స్పష్టం చేశారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. అందుకే ప్రజలు భయపడకుండా తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యమే అసలైన సంపదని పేర్కొన్న ఎమ్మెల్యే, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, పొగతాగడం వంటి హానికర అలవాట్లను పూర్తిగా త్యజించడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని వివరించారు. ప్రజలంతా అవగాహన పెంచుకుని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే తెలిపారు.
Admin
DNB News