DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 298 మంది ఓటర్లకు గాను 262 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు 87.92 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించిన ఎన్నికల నిర్వాహకులకు, అలాగే ఉత్సాహంగా పాల్గొన్న న్యాయవాదులకు ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు మరియు ప్రధాన కార్యదర్శి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తికావడం సంతోషకరమని వారు పేర్కొన్నారు.
Admin
DNB News