DNB News - ఆంధ్రప్రదేశ్ / : యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో జర్నలిజం పీజీ కోర్సులో ఆదోనికి చెందిన మహిళా జర్నలిస్టు పీకే తస్లీమా రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె మెడల్స్ అందుకున్నారు. విశ్వవిద్యాలయంలో మొత్తం 174 మంది గోల్డ్ మెడలిస్టులు ఉండగా, టాప్-10 మందికి గవర్నర్ స్వయంగా మెడల్స్ అందజేశారు. అందులో ఆదోనికి చెందిన తస్లీమా చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఆమె సాధించిన ఈ విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.
Admin
DNB News