DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంబేద్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం , IIIT యూనివర్సిటీ శ్రీకాకుళం నిధులు – నియామకాలపై ఆదాయ వ్యయాలుపై పనితీరు పైన సమీక్ష సమావేశం నిర్వహించిన పియుసి చైర్మన్ శ్రీ కూన *రవికుమార్ శ్రీకాకుళం జిల్లా ఉన్నత విద్యా రంగ అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది. ఆముదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్కూన రవికుమార్ పియూసి కమిటీ సభ్యులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ హాల్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా యూనివర్సిటీలకు సంబంధించి నిధుల వినియోగం,విధులు మరియు బాధ్యతలు, బోధనా-బోధనేతర సిబ్బంది నియామకాలు,ఆదాయ-వ్యయాల వివరాలు మరియు పరిపాలనా పనితీరు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కూన రవికుమార్ మాట్లాడుతూ,ప్రభుత్వం యూనివర్సిటీలకు కేటాయిస్తున్న నిధులు పూర్తిస్థాయిలో విద్యార్థుల మేలు కోసం ఉపయోగపడాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.నియామకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలి, విద్యా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధన అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల ప్రధాన లక్ష్యంగా యూనివర్సిటీలు పనిచేయాలని, ప్రభుత్వ ఉద్దేశ్యాలకు అనుగుణంగా పనితీరు మెరుగుపరచాలని తెలిపారు. అలాగే రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా యూనివర్సిటీల పనితీరుపై స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని, భవిష్యత్‌లో మరింత సమర్థవంతమైన నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పియుసి సభ్యులు పలాస శాసనసభ్యులు గౌతు శిరీష , ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER , పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జిల్లా కలెక్టర్, JC మరియు యూనివర్సిటీ ఉన్నత అధికారులు, అసెంబ్లీ కమిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
DNB News