DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా పోలీసు శాఖ నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Admin
DNB News