Monday, 15 June 2026 01:50:06 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

140వ మేడే దినోత్సవం: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం – 8 గంటల పని హక్కు కాపాడుదాం: సిఐటియు పిలుపు..

Date : 02 May 2026 11:14 AM Views : 37

DNB News - ఆంధ్రప్రదేశ్ / : 140వ మేడే దినోత్సవం సందర్భంగా ఆదోని పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీ, సభలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి భీమా సర్కిల్ మీదుగా రెవెన్యూ భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం జరిగిన మేడే సభలో పట్టణ అధ్యక్షుడు పి.ఎస్. గోపాల్, మండల అధ్యక్షుడు జే. రామాంజనేయులు అధ్యక్షతన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, సీనియర్ నాయకులు ఈరన్న, కార్యదర్శులు తిప్పన్న, సాయి, లక్ష్మన్న, అంగన్వాడి నాయకురాలు సరోజ తదితరులు ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ, 140 సంవత్సరాల క్రితం కార్మికులు ఐక్యంగా పోరాడి 8 గంటల పని హక్కును సాధించుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేడే స్పూర్తితో కార్మిక ఐక్యతను బలపరచాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఈ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక–కర్షక ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, బ్యాంకులను రక్షించాలని, కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, అంగనవాడి, ఆశ వర్కర్లు మరియు ఇతర కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచాలని, కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, అజీమ్ ఖాన్, తిక్కప్ప, హనుమంతు, శంకర్, ముని, గోవిందు, రాజు, గిరి, కరుణ, లలిత, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :