DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజలు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్న డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుచున్న అన్నారు. 53వ డివిజన్ బి ఆర్ ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ముద్దంగుల మహేష్ అన్నాడు. కొత్తగూడెం నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 53వ డివిజన్ నుంచి విద్యావంతుడైన యువకుడు ముదoగుల మహేష్ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పాటు అభివృద్ధి పట్ల దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. 53 వ డివిజన్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మహేష్ తెలిపారు. ముఖ్యంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతుల సమస్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇందుకోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. అలాగే 53వ డివిజన్‌లోని త్రాగునీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు, డ్రైనేజీ సమస్యలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రతి గల్లీకి త్రాగునీరు సమస్యలు పరిష్కారంతో పాటు ప్రతి లైన్లో పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రజా పాలనలో భాగస్వాములు కావాలని కోరుకునే ఆలోచనతోనే తాను రాజకీయాల్లో అడుగుపెట్టానని మహేష్ తెలిపారు. ప్రజల నమ్మకమే తన బలమని డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరమని ఆయన అన్నారు. ప్రస్తుతం 53వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా వింటూ పరిష్కార మార్గాలు వివరిస్తున్న ముదoగుల మహేషకు స్థానికంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజా పాలనలో కొత్త ఆలోచనలు పారదర్శకత జవాబుతారీతనం కలిగిన యువ నాయకుడిగా ఆయనపై ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి.
Admin
DNB News