Monday, 15 June 2026 01:43:54 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో భారీ చర్యలు

Date : 07 March 2026 11:23 AM Views : 59

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో భారీ చర్యలు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). లిక్కర్ స్కామ్‌కు సంబంధించి రూ.441.63 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలు, బూనేటి చాణక్య మరియు అతని అనుబంధ సంస్థలు, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు ఇతరులకు చెందినవిగా ఈడీ గుర్తించింది. బ్యాంకు బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు మరియు ఇతర స్థిరాస్తులు ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ.4 వేల కోట్ల నష్టం కలిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. 2019కి ముందు రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం పూర్తిగా డిజిటల్, పారదర్శక సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ద్వారా నడిచేదని ఈడీ తెలిపింది. అయితే 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వ రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహించిందని వెల్లడించింది. ఈ సమయంలో ఆటోమేటెడ్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, మాన్యువల్ విధానం ప్రవేశపెట్టారని ఈడీ తెలిపింది. దీని ద్వారా సరఫరా ఆర్డర్లు ఇవ్వడంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించిందని వెల్లడించింది. కొన్ని కంపెనీల బ్రాండ్లకు అన్యాయం చేసి, “ఫేవర్ చేసిన” బ్రాండ్లకు మాత్రమే ఎక్కువ సరఫరా అవకాశాలు ఇచ్చి భారీ కిక్‌బ్యాక్‌లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు అక్రమ కమీషన్ వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ కిక్‌బ్యాక్‌లు సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సమన్వయం చేసుకున్నట్లు తెలిపింది. ఈ మొత్తం లిక్కర్ సిండికేట్ ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.3500 కోట్ల నష్టం కలిగిందని ఈడీ వెల్లడించింది. ఈ డబ్బును రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :