DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని ఆశ వర్కర్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదోని మండల కేంద్రంలోని పెద్ద హరివారిణం, పెద్ద తుంబలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మెడికల్ అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు రామాంజనేయులు, వీరారెడ్డి, ఆశ వర్కర్ల నాయకులు లత, రాజేశ్వరి, లావణ్య, సుకన్య పాల్గొని మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు, సమాన వేతనం, పర్మనెంట్ పోస్టులు, ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండు పీహెచ్సీలకు చెందిన ఆశ వర్కర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
DNB News