DNB News - ఆంధ్రప్రదేశ్ / : మండల పరిధిలోని సంతేకుడ్లూరు గ్రామంలో దళిత స్మశాన వాటికకు బోరు ఏర్పాటు చేసి, వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ సచివాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ, దళిత స్మశాన వాటికలో బోరు సదుపాయం లేకపోవడం వల్ల కాలనీ దళిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంత్యక్రియల సమయంలో కనీస నీటి సౌకర్యం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి స్మశాన వాటికలో బోరు ఏర్పాటు చేసి, ట్యాంక్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు పరమేష్, రాము, కోసిగి, ఈరన్న, ఉరుకుందు, రాందాస్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News