DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ. క్యాంప్ ప్రాంతంలో అశ్విని ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజ్ కాలువ వద్ద పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజ్ కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ చర్యలను అధికారులు పరిశీలించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా, మురుగునీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని అధికారులు సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News