DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో సోమవారం నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాలను డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది స్వయంగా తనిఖీ చేసి పరిస్థితులను సమీక్షించారు. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు వచ్చే విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రశ్నపత్రాల రవాణాకు భద్రతా పరంగా ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులు గుంపులుగా చేరకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News