DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంగన్వాడి వర్కర్లు తమ జీతాల పెంపు, గ్రాట్యుటీ మరియు పిఎఫ్ అమలు వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్షకు ఐఎఫ్టియు జిల్లా కమిటీ మరియు హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సంఘీభావం తెలియజేశాయి. దీక్షా కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడి ఆయా కార్యకర్తలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.జి. శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమైందని, ప్రభుత్వం తక్షణమే వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో సేవలు అందిస్తున్న అంగన్వాడి సిబ్బందికి గ్రాట్యుటీ, పిఎఫ్ వంటి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఐఎఫ్టియు జిల్లా నాయకులు నరసన్న, వెంకప్ప తదితరులు మాట్లాడుతూ మార్చి 2, 3 తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ పూర్తి సంఘీభావం, సహకారం అందజేస్తామని తెలిపారు.
Admin
DNB News