DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం బసరకోడు గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో ఆదోని శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థిని–విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పీసీలు బాల భాస్కర్, మల్లప్ప నాయకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శక్తి యాప్‌ను మొబైల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో వివరించారు. బాల్య వివాహాలు నివారించాల్సిన అవసరంపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, రోడ్డు ప్రమాదాల నివారణ, పోక్సో చట్టం గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని శక్తి టీం సభ్యులు సూచించారు.
Admin
DNB News