DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధనా విధానం, హాజరు శాతం, మౌలిక వసతుల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించి, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. క్రమశిక్షణతో చదివితే మంచి విజయాలు సాధించవచ్చని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని, అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Admin
DNB News