DNB News - ఆంధ్రప్రదేశ్ / : నా ప్రమాణ స్వీకారం కేవలం ఒక హోదా స్వీకారం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల, స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాల పట్ల చేసిన ప్రజా ప్రమాణం” అని నూతన బాధ్యతలు స్వీకరించిన గుడిసె ఆది కృష్ణమ్మ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆమె తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే తన తక్షణ లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అహర్నిశలు శ్రమించే కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొన్నారు. అన్యాయంపై ప్రశ్నించడం తన నైజమని, కార్యకర్తల గౌరవాన్ని కాపాడటమే తన మొదటి ప్రాధాన్యత అని ఆది కృష్ణమ్మ తెలిపారు. ఇక నుంచి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్వరం మరింత గట్టిగా వినిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె. మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యేలు డాక్టర్ పార్థసారథి (ఆదోని), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి (ఎమ్మిగనూరు) తదితర ముఖ్య నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News