DNB News - ఆంధ్రప్రదేశ్ / : చెన్నైలో ధరల పెరుగుదల కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఒక కస్టమర్ టిఫిన్ చేసి బిల్లు చూసి కంగుతిన్నాడు. అందులో టిఫిన్ ధరల కింద 'Gas Usage Fee' పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేశారు. "మేము హోటల్‌కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి, మళ్ళీ వంట గ్యాస్ ఖర్చు విడిగా కట్టాలా?" అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి.
Admin
DNB News