DNB News - ఆంధ్రప్రదేశ్ / : *IBPS 2025లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికైన వినోద్‌కు... ఎమ్మెల్యే అభినందనలు...* డి యన్ బి న్యూస్ ఆదోని, జనవరి 22 ఆదోని పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన నిరుపేద టైలర్ కుటుంబం కుమారుడు వినోద్ కుమార్ IBPS 2025 ఫలితాల్లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికై ప్రతిభ చూపడంపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. గురువారం వినోద్ నివాసానికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే , వినోద్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ తల్లిదండ్రులు సత్యనారాయణ, రాజేశ్వరి దంపతులు తమ కుమారుడికి అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని కొనియాడారు. 22 సంవత్సరాల వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొంటూ, ఆదోని పట్టణంలోని యువతి, యువకులు వినోద్‌ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానాలు సాధించాలని ఎమ్మెల్యే డా. పార్థసారథి సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం పెద్దలు నరసింహులు, లక్ష్మన్న, వీరసేన, జక్కా వీరేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News