Wednesday, 17 June 2026 04:02:20 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోని పట్టణ సమస్యలపై తక్షణ చర్యలు కోరిన సిపిఎం నాయకులు..

Date : 18 February 2026 11:18 AM Views : 76

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదోని మున్సిపల్ కమిషనర్ నయూం ని కలిసి సమస్యలతో స్వాగతం పలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సీనియర్ నాయకులు ఈరన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, నాగరాజు, వెంకటేష్, అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆదోని పట్టణంలో సమస్యలు “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని దాదాపు 165 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన మున్సిపాలిటీగా, ఒకప్పుడు “రెండవ ముంబై”గా ప్రసిద్ధి చెందిన పట్టణమని గుర్తుచేశారు. అయితే పాలకుల నిర్లక్ష్యంతో పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పాత ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉండి కూలే పరిస్థితిలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. నిత్యం ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. అలాగే పట్టణంలో ఆహ్లాదకరమైన పార్కులు ఏర్పాటు చేసి, ప్రస్తుత పార్కుల్లో పిల్లల ఆటపరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు చొరవ చూపాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: