Thursday, 16 April 2026 05:05:12 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్.

Date : 16 April 2026 10:59 AM Views : 87

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గురువారం ఉదయం పరిశీలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి వివరాలు సేకరించారు. మంత్రాలయం దర్శనానికి వెళ్తున్న కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. బొలెరో వాహనం రెడిమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు టౌన్ సిఐ శ్రీనివాసులు, మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :