DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి, బొల్లవానిపల్లె, పగిడిరాయి గ్రామాల పరిధిలో గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బంగారం వెలికితీతలో భాగంగా ప్రాణాంతక రసాయనాలు, ముఖ్యంగా సైనైడ్ వినియోగం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణం తీవ్ర ప్రమాదంలో పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురవరం గీత మాధురి, కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారి ప్రకారం: మైనింగ్ వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది గాలి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు క్యాన్సర్, కిడ్నీ మరియు ఇతర అనుమానాస్పద వ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు పంట భూములు, పళ్ల తోటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడం, పంటలు రాకపోవడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో: మైనింగ్ మరియు ఫ్యాక్టరీపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభావిత రైతులకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని పరిశ్రమలపై కఠిన పర్యావరణ నియంత్రణలు అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయవాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళి నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ నాగేశ్వరావు, నాయకులు సాయి, చలపతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News