DNB News - ఆంధ్రప్రదేశ్ / : ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రాణాలను రక్షించుకోవాలని కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ వాహనదారులకు సూచించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ, “నేను ట్రాఫిక్ మిత్ర” ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కౌన్సెలింగ్‌లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఈ-చలానాల రికవరీని వేగవంతం చేసినట్లు తెలిపారు. వాహనదారులు తమ పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించాలని సూచించారు. అలాగే నిబంధనల ఉల్లంఘన పునరావృతమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. కర్నూలు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Admin
DNB News