Wednesday, 17 June 2026 01:32:34 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

చంద్రబాబుకు సూటి ప్రశ్నలు సంధిచిన - జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను.

Date : 28 February 2026 11:41 AM Views : 137

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు,భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన సాగింది. ఇప్పుడు మీ పాలనలో యూరియా కొరత, డయేరియా మోతగా విధ్వంసం దిశగా పాలన సాగుతుంది. పబ్లిసిటీ షూటింగులు తప్ప ప్రజలకు మీరు చేసింది ఏమైనా ఉందా..? . ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే గుర్లలో డయేరియా బారినపడి 11 మంది మరణించారు. అలాగే కురుపాం గురుకుల హాస్టల్లో నలుగురు మరణించారు. సుమారు 200 మంది పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఇక్కడ పర్యటించి బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ డయేరియా బారిన పడి మరి కొంత మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు.శ్రీకాకుళంలో కూడా డయేరియా విజృంభించి ఎందరో మరణించారు. మరొకవైపున కల్తీ పాలతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మరణించారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ తీసుకున్న చర్యలు శూన్యం. పిల్లలకు జ్వరం వస్తే మాది బాధ్యత ఎలా అవుతుందంటూ జిల్లాకు చెందిన మంత్రిగారు వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.రావడం ఫోటోలు దిగి వెళ్లడం,పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ప్రజలకు మీరు చేసిన మంచి ఏదైనా ఉందా..? త్రాగునీరు,సాగునీరు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.విద్య,వైద్యం,సేద్యం ఈ రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. భూములు దోచుకోవడం మీద మాత్రమే పూర్తిగా శ్రద్ధ పెట్టారు తప్ప సంక్షేమం,అభివృద్ధి పట్ల ఏమాత్రం ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.నాడు వైయస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్ పాలనలో మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరిగింది. తోటపల్లి ప్రాజెక్టు పనులు జరిగాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఉత్తరాంధ్ర నేతలను , ఈ ప్రాంత యాస,భాషను కించపరచడం తప్ప కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏదైనా ఉందా.? ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధికారులతో సమీక్ష జరపండి, పూర్తిగా మీ పాలనలో నిర్వీర్యమైపోయిన విద్య, వైద్య వ్యవస్థను గాడిలో పెట్టండి. గత ఎన్నికల ముందు మీరు చీపురుపల్లిలో పర్యటించి ఈ ప్రాంతానికి అనేక హామీలు ఇచ్చారు. వాటి సంగతి ఏమైంది? అందులో ఎన్ని నెరవేర్చారన్నది చెప్పండి. గత మా వైయస్సార్సీపీ పాలనలో విద్యా,వైద్య రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి,నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను,ఆసుపత్రులను అభివృద్ధి చేశాం. మెడికల్ కాలేజీలను నిర్మించాం. ఇప్పుడు మీ పాలనలో విద్య వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి , సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. ఇక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఆచూకీ లేకుండా పోయింది.సమీక్షలు లేవు,పర్యవేక్షణ లేదు,అధికారులను అడిగితే మాకు నిధులు లేవు మందులు లేవు అని సమాధానం చెబుతున్నారు. మరొకవైపు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు,యూరియా సరఫరాలేదు.పంటల కొనుగోలు కేంద్రాలను తెరవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు , దళారుల బెడద ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా పబ్లిసిటీని షూటింగ్స్ కాస్త తగ్గించుకొని ఈ ప్రాంత ప్రజలకు ఏమి చేశారో చెప్పాలి. ఇక్కడ ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేరుగా ప్రశ్నలు వర్షం కురిపించారు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను).

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :