DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని శ్రీనివాస్ భవన్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి టిఫిన్ నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న టిఫిన్ల రుచి, నాణ్యత, పరిశుభ్రతను కమిషనర్ స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు అందించే ఆహారం రుచికరంగా, పరిశుభ్రంగా మరియు నాణ్యతతో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. క్యాంటీన్ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల తయారీలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ప్రజల నుండి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కూడా ఇదే నాణ్యతను కొనసాగించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News