DNB News - ఆంధ్రప్రదేశ్ / : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు నరసన్న, ఎంకప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై భారీ పన్నులు విధిస్తూ ప్రజలపై భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు పూర్తయ్యాక వరుసగా ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మల్లి హనుమంతు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News