DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో సిఐటియు నాయకులు పి.ఎస్. గోపాల్ తిప్పన్న, ఏఐటియుసి నాయకుడు భీమేష్, బి. వెంకన్న, ఐఎఫ్టియు నాయకులు జి. ఎంకప్ప, నరసన్నలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్మికులు, కర్షకులు, సంఘటిత-అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, రవాణా రంగం మరియు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు జీవన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను వెంటనే ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Admin
DNB News