Wednesday, 17 June 2026 03:12:33 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి DHPS..

Date : 06 April 2026 05:56 PM Views : 47

DNB News - ఆంధ్రప్రదేశ్ / : దేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని, చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్థనే రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) డిమాండ్ చేసింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని, సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ DHPS ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం కొత్తూరు ఈరన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా DHPS జిల్లా సహాయ కార్యదర్శి టీ. వీరేష్, DHPS నియోజకవర్గ కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, ACUC పట్టణ కార్యదర్శి ఆనంద రాజు, వివిధ సంఘాల పాస్టర్లు మాట్లాడుతూ దేశంలోని క్రైస్తవ మత ప్రచారకుల్లో అధికంగా అగ్రకులాల వారే ఉన్నారని, వారికి లేని నిబంధనలు దళిత క్రైస్తవులకు మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయో ప్రశ్నించారు. ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కుల వివక్షను రూపుమాపలేకపోతే కుల వ్యవస్థనే రద్దు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లకు విరుద్ధమని విమర్శించారు. క్రైస్తవ మతంలోకి మారిన అగ్రకులాల వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లభిస్తున్నప్పుడు, అదే మార్గాన్ని అనుసరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వర్తించకూడదని ప్రశ్నించారు. 1956లో సిక్కు దళితులకు, 1990లో బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా కల్పించినట్లు పేర్కొంటూ, దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో AEOకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో DHPS గౌరవ అధ్యక్షుడు ప్రకాష్, DHPS పట్టణ కార్యదర్శి కుమారస్వామి, సుజ్ఞానమ్మ, ACUC అధ్యక్షుడు ఎజ్రా శ్రీధర్, CPI పట్టణ సహకార కార్యదర్శి రమేష్, AIYF కార్యదర్శి అంజిత్ గౌడ్, CPI మండల కార్యదర్శి ఎల్లప్ప, సత్యనారాయణ, ఏసుదాస్, లాలప్ప, పుష్పరాజ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: