DNB News - ఆంధ్రప్రదేశ్ / : గనేకల్ గ్రామంలో జరిగిన సంచలన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 28.04.2026 అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో గనేకల్ గ్రామంలో ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థలు ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో కుల్లూరు వెంకటేశ్వర్లు, తన ఇంటి సమీపంలో నివసిస్తున్న సంకిరెడ్డి హనుమంత రెడ్డిని గొడ్డలితో కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 02.05.2026 మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో గనేకల్ గ్రామ ఆర్చ్ సమీపంలో నిందితుడు కుల్లూరు వెంకటేశ్వర్లును అదోని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి. నల్లప్ప అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని త్వరితగతిన పట్టుకోవడంలో కృషి చేసిన పెద్ద తుంబలం ఎస్‌ఐ విద్యాశ్రీతో పాటు హెడ్ కానిస్టేబుల్ గోపాల్, వెంకటేష్ నాయక్, రంగస్వామి, నరసింహులు, బంగారప్పలను సి.ఐ అభినందించారు. సి. నల్లప్ప సర్కిల్ ఇన్‌స్పెక్టర్, అదోని రూరల్ సర్కిల్
Admin
DNB News