DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజధానిగా ‘మావిగన్’ మాత్రమే ఆచరణ సాధ్యం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం, ఏప్రిల్ 8: ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను భ్రమల్లో ముంచుతూ, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.బుధవారం శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలు కేవలం దోపిడీ కోసమే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదని విమర్శించారు 2014లో 50 వేల ఎకరాలు చాలని చెప్పిన బాబు, ఇప్పుడు లక్ష ఎకరాలు కావాలని అడగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని,లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసమే రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతాయని,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది ఇప్పట్లో పూర్తయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు.అమరావతి నిర్మాణ వ్యయంపై తమ్మినేని సంచలన గణాంకాలు బయటపెట్టారు.దేశ రాజధాని ఢిల్లీ 10,500 ఎకరాల్లో విస్తరించి ఉంటే, అక్కడ చదరపు అడుగుకు రూ. 4 వేలు ఖర్చు చేశారని.. కానీ అమరావతిలో చదరపు అడుగుకు రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు తెలంగాణ సచివాలయం 28 ఎకరాలలో 10 లక్షల ఎస్ ఎఫ్ టీ 615 కోట్లు ఖర్చు చేస్తే దేశ పార్లమెంట్ 970 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఆ భవనాలు కంటే అమరావతి అసెంబ్లీ భవనానికి 1449 కోట్లు భవనాల అంచనాలు భారీగా పెంచి చూపడం ఎవరి జేబులు నింపడానికని ప్రశ్నించారు. 2014 -19 పోలవరం ప్రాజెక్టును ఏ టీ ఏం కార్డులా వాడుకున్నారని ఇప్పుడు అమరావతిని ఏ టి ఎం లా వాడుతున్నారని ఎద్దేవ చేశారు. కేవలం గత ఏడు ఏళ్లలో అమరావతి నిర్మాణానికి రూ. 8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ లెక్కన రాజధాని పూర్తి కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కేవలం ఈ 22 నెలల్లో 3లక్షల55 వేల కోట్లు అప్పు చేశారని ఈ పరిస్థితుల్లో రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ఆచరణ సాధ్యమా అని ఈ రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు తెలియజేయాలని ఆయన నిలదీశారు ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'ప్లాన్-బి' (మావిగన్ - మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్) ప్రాముఖ్యతను ఆయన వివరించారు.110 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే మచిలీపట్నం పోర్టు, గన్నవరం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, విజయవాడ గుంటూరు రైల్వే జంక్షన్లు మరియు కృష్ణానది అటు పోలవరం కుడి కాలువ ద్వారా పుష్కలమైన నీటి వనరులు, ఎన్ టి టి పి ఎస్ ధర్మల్ తో పాటు పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ కావలసినంత ఇoదన వనరులు ఉన్నాయని అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం 10 శాతం ఇక్కడ పెడితే ఇది ప్రపంచస్థాయి నగరంగా మారుతుందని తెలిపారు. పోర్టు అనుసంధానంగా ఉన్న వేగంగా అభివృద్ధి చెందిన చెన్నై ముంబై నగరాలు సరసన మావిగన్ చేరుతుందని హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలతో వేగంగా పోటీపడి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు అదేవిధంగా మావిగన్ నమూనాలో నాలుగు కార్పొరేషన్లు రెండు మున్సిపాలిటీలు ఉండడమే కాకుండా 60 లక్షల పైగా జనాభా ఉండడం వలన ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు శివరామకృష్ణ కమిటీ సూచనల మేరకు వికేంద్రీకరణే సరైనదని, అందుకే జగన్ గారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. కానీ బాబు అండ్ కో విషప్రచారంతో దానిని అడ్డుకున్నారని మండిపడ్డారు అమరావతి నిర్మాణంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు కి 14 వేలు ఖర్చు చేస్తున్నారు అదే విధంగా దేశంలో ఆరు లైన్ల జాతీయ రహదారి కిలోమీటర్ కు 20 కోట్లు చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే అమరావతిలో కిలోమీటర్ కి 53 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నారని అదేవిధంగా రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ లో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు 401 కోటి ఖర్చు చేశారని దేశంలో ఎక్కడైనా డిజైన్లకు ఇoత ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు మావిగన్ ప్రజల్లో మంచి స్పందన రావడంతో దానిని డైవర్ట్ చేయడం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ వైయస్సార్ పార్టీ నాయకులు పై మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుస్తాకరం బాధాకరంగా ఉన్నాయన్నారు ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని తమ్మినేని సీతారాం అన్నారు చివరగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న భూ కుంభకోణాలపై కూడా తమ్మినేని తీవ్రంగా స్పందించారు.మూలపేట పోర్టుకు జగన్ గారు అన్ని అనుమతులతో 70 శాతం పనులు పూర్తి చేస్తే, ఇప్పుడు ‘బాబాయ్-అబ్బాయిలు’ మరో 15 వేల ఎకరాల భూసేకరణ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ అని,రైతుల భూములతో ఆడుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.అమరావతి ముసుగులో జరుగుతున్న ఈ దోచుకో-పంచుకో-తినుకో విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని,త్వరలోనే దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి కుమార్ శ్రీకాకుళం ఎంపీపీ అంబటి శ్రీను రాష్ట్రా ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ హెచ్చర్ల జడ్పీటీసీ సనపల నారాయణరావు కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ సీనియర్ న్యాయవాది సింగుపురం మోహనరావు ఆమదాలవలస మాజీ జడ్పీటీసీ బొడ్డేపల్లి నారాయణరావు జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువత అధ్యక్షులు మార్పు పృద్వి ద్వారపూ అజిత్, సీపాన వెంకట్రావు తదితరులు పాల్గున్నారు
Admin
DNB News