Wednesday, 17 June 2026 02:47:13 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ బాలాజీ విద్యానికేతన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి – SFI హెచ్చరిక.

Date : 04 April 2026 11:48 AM Views : 47

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వల్ల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులు తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ ఫ్రైడే పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పాఠశాలకు సెలవు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వైఖరి విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తోందని అన్నారు. గాయపడిన విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, వారి కుటుంబాలకు పూర్తి సహాయం చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై వెంటనే స్పందించి, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో SFI పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్ పాల్గొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే, SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :