Saturday, 18 April 2026 02:17:15 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం..

Date : 07 March 2026 11:06 AM Views : 53

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడమే లక్ష్యంగా HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వ్యాక్సిన్ క్యాంపెయిన్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే (14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజుకు ముందున్న) బాలికలందరికీ ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. ‘గార్డాసిల్-4’ (Gardasil-4) వ్యాక్సిన్‌ను 0.5 మిల్లీలీటర్ల మోతాదులో ఎడమ చేతికి వేస్తారని తెలిపారు. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు మరియు తల్లిదండ్రుల సమ్మతి పత్రం (Consent Letter) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టీకా వేయించుకునే వారు ‘U-Win’ పోర్టల్ లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. టీకా వేయించుకోవడానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆహారం తీసుకొని రావాలని సూచించారు. టీకా వేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో మొత్తం 19,704 మంది బాలికలను లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాంపెయిన్ సుమారు మూడు నెలల పాటు కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డా. భాస్కర్ రాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. చిట్టి నరసమ్మ, డీసీహెచ్ఎస్ డా. జాఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :