Wednesday, 17 June 2026 02:55:07 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్

Date : 04 June 2026 11:57 AM Views : 23

DNB News - తెలంగాణ / : మునగాల:మండల కేంద్రంలోని ఊర చెరువు మరియు తాడ్వాయి గ్రామ శివారులోని ఎర్ర చెరువు ను అక్రమంగా కొంతమంది ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టి పోయిస్తూ స్వాధీనం చేసుకున్నప్పటికీ, చెరువు భూములను రక్షించి ఆక్రమణలనుఅడ్డుకోవాల్సిన సంబంధిత రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరించడం సరైన కాదని, తక్షణమే చెరువు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని మునగాల, తాడ్వాయి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పిట్టల శీను, బిట్టు లింగయ్య డిమాండ్ చేశారు, బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మునగాల గ్రామంలోని ఊరచెరువును మరియు తాడ్వాయి గ్రామంలోని ఎర్ర చెరువును గత రెండు నెలలుగా కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని చెరువు శిఖం భూముల్లోమట్టితోలకం పనులు నిర్వహిస్తూ, అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై తాము ఇప్పటికే మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ మరియు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఇరు శాఖల అధికారులు సంబంధిత అక్రమనదారులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా రోజురోజుకు చెరువు శిఖం భూములపై ఆక్రమణదారులు పెత్తనం చెలాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, చెరువుల ఆక్రములపై స్థానిక అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు సైతం అధికారులకు పలుమార్లు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు నేటి వరకు ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు, ఇప్పటికే ఇరు చెరువుల్లో చెరువు సరిహద్దుల్లో ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఆక్రమించుకోవడంతో చెరువు విస్తీర్ణం తగ్గి తాగు సాగునీటికి మరియు చెరువుల్లో మత్స్య సంపదపై జీవనం గడిస్తున్న మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే చెరువు ఆక్రములపై దృష్టి పెట్టి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :