DNB News - తెలంగాణ / : నగరంలోని ఉస్మాన్‌పురా, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కుబేర క్లాత్ షోరూం’ రెండో బ్రాంచ్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ కరీంనగర్ వస్త్ర వ్యాపార రంగంలో కుబేర షోరూం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ముఖ్యంగా వైట్ క్లాత్ విభాగంలో దాదాపు 200 రకాల వెరైటీలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణలోనే మొట్టమొదటి షోరూం ఇదని ఆయన పేర్కొన్నారు.నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి మూడు రోజుల పాటు కస్టమర్లకు 75 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.తెలంగాణలోనే అత్యధిక వైట్ క్లాత్ రకాలు ఇక్కడ లభిస్తాయి.మొదటి బ్రాంచ్‌ను ఆదరించినట్లే, కరీంనగర్ ప్రజలు ఈ రెండో బ్రాంచ్‌ను కూడా ఆదరించి విజయవంతం చేయాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, ప్రముఖులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Admin
DNB News