Tuesday, 28 April 2026 03:01:09 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 28 April 2026 10:24 AM Views : 4

DNB News - తెలంగాణ / : భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సోమవారం మండల వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తమ యొక్క పార్టీ జెండాను ఆవిష్కరించి, కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని ఆవిర్భావ దినోత్సవ వేడుక సంబరాల్ని నిర్వహించారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం గణపవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు తొగర రమేష్ ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు స్వీట్లు పంపిణీ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, ఈసందర్భంగా నిర్వహించిన సభలో పార్టీ సీనియర్ నాయకులు సుకరి అజయ్ కుమార్ మాట్లాడుతూ, 2001 లోకెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ ,14 సంవత్సరాల పాటు ప్రత్యేక తెలంగాణరాష్ట్రసాధన కోసం చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్రచరిత్రలోనిలిచిపోతుందన్నారు,శాంతియుత మార్గంలో పోరాటం నిర్వహించి,తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారధ్యంలో పదేళ్లపాటు రాష్ట్రప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ సొంతమన్నారు,తదనంతర పరిణామాలతో దేశవ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేయాలని తెలంగాణరాష్ట్రసమితి,టిఆర్ఎస్ పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు, 2023లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారానికి దూరమైనప్పటికీ, గత రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తు బిఆర్ఎస్ ముందుకు సాగుతుందని,ఆయన తెలిపారు, ఈకార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్లుకందిబండసత్యనారాయణ తొగరు సీతారాములు, రామ్ రెడ్డి, పార్టీ పట్టణఅధ్యక్షుడు ఉడుంకృష్ణ ఎల్ పి రామయ్య, వేట శివాజీ, కోళ్ల ఉపేందర్, గడ్డం లింగయ్య, జానీ,లక్ష్మయ్య, రామకృష్ణ, నవీన్ రెడ్డి, నాగబాబు,రచ్చ శ్రీను, గడ్డం విజయ్, సైదా, గంధం మహేష్, రాజేష్, రోడ్డు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: