Monday, 15 June 2026 01:56:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. ..

Date : 27 April 2026 10:46 AM Views : 47

DNB News - తెలంగాణ / : హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం అని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ ఉప మండలం ,శ్రీరామ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ ధర్మం , సనాతన ధర్మం కు శాశ్వత చిరునామా భారతదేశమే అన్నారు. అందుకే ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే భారత దేశానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సంప్రదాయాలుకాపాడుకోవాలన్నారు. దేశ ప్రగతికి సత్యం, ధర్మం వంటి విలువలను ఆచరించడం అవసరమని తెలిపారు. పంచ పరివర్తనల ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని , ఆ దిశగా ముందుకు కొనసాగాలని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. హిందూ సమాజం ఐక్యత తో ఉండాలన్నారు. హిందూ ధర్మ రక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి నడుం బిగించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళన సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, మజ్జిగ ను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు సరఫ్ రామకృష్ణ , గర్రెపల్లిమహేశ్వర శర్మ అయ్యగారు , మహిళా వక్త అనుపమ లతో పాటు సదాశివ పల్లి, మానకొండూర్ , ముంజంపల్లి, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, ఈదులగట్టపల్లి,గ్రామాల హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :