DNB News - తెలంగాణ / : దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ , నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున కరీంనగర్లోనీ ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులుగంగాడి కృష్ణారెడ్డి , నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, శశిధర్, బీజేవైఎం సంపత్, గుగ్గిళ్ళ రమేష్, సత్యనారాయణ రెడ్డి, సోమిరెడ్డి వేణు,, సునీత, స్వప్న, లావణ్య రెడ్డి, చైతన్య,, నరేడ్ల ప్రవీణ్ చంద్ర,, బండారి వేణు, చంద్రిక, వివిధ డివిజన్ మహిళలు పాల్గొన్నారు.
Admin
DNB News