Thursday, 16 April 2026 05:07:43 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం

Date : 15 April 2026 05:42 PM Views : 9

DNB News - తెలంగాణ / : కరీంనగర్ లోని కోట ఇన్స్టిట్యూట్ వారి రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ కు ఇంటర్ ఫలితాల ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టిందని ఇది కరీంనగర్ కు గర్వకారణమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు కరీంనగర్ లోని రేకుర్తి లో గల కెపిఎస్ హైస్కూల్లో కోట రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు వచ్చిన సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు కరీంనగర్లో అనతి కాలంలోనే కార్పొరేట్ కళాశాలలను తలదన్నేలా గ్రామీణ ప్రాంతం నుండి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనె ఉద్దేశంతో ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనే సంకల్పంతో కోట విద్యాసంస్థలను స్థాపించిన చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు ప్రపంచంలో చదువును మించిన ఆయుధం లేదని కష్టపడి చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉన్నారని కోట విద్యాసంస్థలు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆకాంక్షించారు మరో అతిథి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అంజిరెడ్డి కరీంనగర్ కు రాష్ట్రస్థాయిలో కీర్తి తీసుకురావడం మనందరికీ గర్వకారణం అన్నారు ఫలితాలు రావడానికి ఇంకా టైం పడతది అనుకున్నా ఒక యజ్ఞంలా కృషిచేసి తొందరలోనే ఫలితం వచ్చేలా కృషిచేసిన డాక్టర్ డి అంజిరెడ్డి ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పరంపర కొనసాగించాలని కోరారు కోట ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు కరీంనగర్లో బ్రాండ్ ఇమేజ్ గా మారిందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో నెంబర్ వన్ గా కరీంనగర్ను తీర్చిదిద్దాలనే దానికి కోట విద్యాసంస్థలు బాటలు వేశాయని అన్నారు మరో అతిథి ట్రస్మ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి యొక్క క్రమశిక్షణ అతనిని బ్రాండ్ ఇమేజ్కు దగ్గరగా తీసుకు వెళ్లిందని అన్నారు కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు ఎక్కడికో వెళ్లకుండా స్మార్ట్ క్లాస్ విద్యా విధానం ద్వారా స్థానికంగానే మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో కోట విద్యాసంస్థలను స్థాపించి తొలి ప్రయత్నం లోనే రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపక బృందం ఇచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు నమోదు చేస్తామని డాక్టర్ డి అంజిరెడ్డి అన్నారు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ మార్క్ సాధించిన ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గాలి సౌమ్యశ్రీ 469, ద్వితీయ సంవత్సరం కే సహన శ్రీ 995 , ద్వితీయ సంవత్సరం బైపీసీలోజి రోషిని 993 , బైపిసి ప్రథమ సంవత్సరంలో పి శరణ్య438 లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు లు అందించి పూల గుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :