DNB News - తెలంగాణ / : మానకొండూర్ ఉప మండలం, సదాశివ పల్లి ,మానకొండూర్, ముంజంపల్లి, శ్రీనివాస్ నగర్ జగ్గయ్యపల్లి ,లింగాపూర్, ఈదుల గట్టపల్లి గ్రామంలో ఈనెల 25న తలపెట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతిని , కరపత్రాలను బుధవారం రోజున స్థానిక విఠలేశ్వర ఆలయం (మందిరం) లో పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. హిందూ సమ్మేళనం ను ఘనంగా నిర్వహించడానికి తగిన కార్యచరణతో ముందు కొనసాగుతున్నట్లు శ్రీరామ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు సరఫ్ రామకృష్ణ తెలిపారు. మానకొండూరు ఉప మండలంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Admin
DNB News