DNB News - తెలంగాణ / : జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని విస్నూర్ కు వెళ్ళే ప్రధాన రహదారిపై ఆరబోసిన మొక్కజొన్నల వల్ల బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విస్నూరు గ్రామానికి చెందిన రమేష్ రావు ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డుపై ఉన్న ధాన్యంపై జారి కిందపడి తలకు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. రహదారులపై పంటలు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహన దారులు,గ్రామస్తులు కోరుతున్నారు. పాలకుర్తిలో నలుదిక్కులా విచ్చలవిడిగా మొక్కజొన్నలు ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతులకు ధాన్యం సరే ప్రాణాలు పోతే బాధ్యత వహించవలసింది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Admin
DNB News