Monday, 15 June 2026 02:28:31 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు

Date : 16 April 2026 09:44 AM Views : 52

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జరుగుతున్న రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన సదస్సును విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి సతీష్ కుమార్ అధ్యక్షతన జరగగా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మానవ జీవితం చాలా ముఖ్యమైనదని దీని కొరకు రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపకులపతి ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా యువత రాష్ డ్రైవింగ్ వీడి జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఒక వ్యక్తిని కోల్పోతే కుటుంబం మొత్తం అనాధగా మారుతుందని విద్యార్థులు రహదారులపై బాధ్యతాయుతంగా ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని భద్రతా వారోత్సవాల సూచనలను అందరికీ తెలియజేయాలని ప్రచారం ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలియజేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ యువత సురక్షితంగా రక్షణాత్మకంగా వాహనాలు నడపాలని 90 శాతం రోడ్డుపై జరిగే ప్రమాదాలలో మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని సురక్షితమైన డ్రైవింగ్ కొరకు నిబంధనలను పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రిపుల్ రైడింగ్ వీడాలని, తప్పనిసరిగా సీట్ బెల్ట్ లు ధరించాలని, మూల మడతల వద్ద జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, జీవితాన్ని బంగారుమయం చేసుకోవాలంటే యువత అనుక్షణం అప్రమత్తతో వాహనాలు నడపాలని ముఖ్యంగా స్పీడ్ నిబంధనలను పాటించాలని, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దని , ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతుందని అందులో ఒకరు మృతులైతున్నారని, దానివలన వారి కుటుంబ సభ్యులు ఎంత వేదన చెందుతారో అర్థం చేసుకోవాలని విశ్వవిద్యాలయ విద్యార్థులు భద్రతా సూచనలను ప్రచారం ద్వారా అందరికీ తెలియజేయాలని సూచించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ట్రైనీ ఐపీఎస్ సోహన్ సునీల్ మాట్లాడుతూ సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, తాగి వాహనాలు నడపరాదని సూచించారు. మరొక అతిది కొత్తపల్లి ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ మాట్లాడుతూ సెల్ఫీల మోజులో కూడా ప్రమాదాలకు గురవుతున్నారని, రాంగ్ రూట్ లో వాహనాలు నడపారాదని తెలియజేశారు. ఈ భద్రత అవగాహన సదస్సులో భాగంగా కరపత్రాన్ని విడుదల చేయగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎన్నారై నిధుల సహకారంతో విశ్వవిద్యాలయ విద్యార్థులకు సురక్షితంగా వాహనాలు నడపడానికి హెల్మెట్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టు వి సి డా. హరికాంత్ పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతి, డా. అబ్రారుల్ బకి, చీఫ్ వార్డెన్ డా. మునవర్ మునావర్, ఆచార్య సుజాత, డా. జోసఫ్ డా. ప్రసాద్, డా. కిరణ్, డా. విజయప్రకాశ్, డా. మనోజ్, డా. నరేష్ వివిధ విభాగాల అధిపతులు కామర్స్,ఆర్ట్స్, న్యాయ, సైన్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :