Thursday, 16 April 2026 05:05:43 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం

Date : 16 April 2026 11:30 AM Views : 4

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం వేదిక: పోస్ట్ ఆఫీస్ సెంటర్, కొత్తగూడెం నిర్వాహకులు: రవాణా శాఖ & పోలీస్ శాఖ ముఖ్య అతిథులు: డి.ఎస్.పి ఆదినారాయణ, ఎంవీఐ మనోహర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన "అరైవ్ అలైవ్" రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. "అరైవ్ అలైవ్" అంటే 'క్షేమంగా ఇంటికి చేరడం'. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని తగ్గించి, ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరాలనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ "రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించగలం". మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వాడకం వంటి కారణాలు అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టుతున్నాయి. కాబట్టి ద్విచక్ర వాహనదారులు వెనుక కూర్చునే వారితో సహా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. కారు నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు. "మీరు నియమం పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మీ కుటుంబం కోసం, సమాజం కోసం మీరు తీసుకున్న ఈ జాగ్రత్తకు ధన్యవాదాలు. అరైవ్ అలైవ్ - క్షేమంగా ఇంటికి చేరండి." గులాబీ పువ్వు ప్రేమకు, జీవితానికి చిహ్నం. మీరు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారని అర్థం. "యువత ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి". ఈ 'అరైవ్ అలైవ్' ఒక కార్యక్రమం కాదు, ఒక ఉద్యమంగా మారాలి. రోడ్డు భద్రత అనేది పోలీసుల ఒక్కరి బాధ్యత కాదు, సమాజం మొత్తం ముందుకు వస్తేనే ప్రమాదాలను తగ్గించగలం. ప్రాణం విలువైనది. ఒక క్షణం నిర్లక్ష్యం జీవితాంతం శోకం మిగులుస్తుంది. కాబట్టి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, అతివేగం వద్దు, మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు. ఈ కార్యక్రమానికి డి.ఎస్.పి, ఆర్టీవో, వన్ టౌన్ సిఐ, ట్రాఫిక్ ఎస్ఐ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :