Monday, 15 June 2026 02:25:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

Date : 16 April 2026 11:24 AM Views : 61

DNB News - తెలంగాణ / : రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలా భావించాలి : ఎస్పీ రోహిత్ రాజు అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమం అశ్వారావుపేటలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు “అరైవ్ ఎలైవ్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,మున్సిపల్ పాలకమండలి సభ్యులు,అధికారులు,విద్యార్థులు,యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, “అరైవ్ ఎలైవ్” కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు.ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ,ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించగా అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,ఎస్పీ రోహిత్ రాజు,మున్సిపల్ చైర్మన్ శశికళ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం రోడ్లపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి,వాటి ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా అధికారులు,ప్రజలు కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ,వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు,మున్సిపల్ కమిషనర్ నాగరాజు,అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సై యాయాతి రాజు,అదనపు ఎస్ఐ అఖిల,ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు,సర్పంచులు, ఉప సర్పంచులు,అంగన్వాడి కార్యకర్తలు, వివోఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :