DNB News - తెలంగాణ / : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ అనే పేరుతో పేదల కు మొండి చేయి చూపి ధనికుల ఆస్తులను రెట్టింపు చేసేలా ఉందని పీసీసీ మెంబర్ మహమ్మద్ జావేద్ విమర్శించారు. బడ్జెట్ ప్రధానంగా మౌలిక సదుపాయాలు రక్షణ మూలధన వ్యయాలపై దృష్టి సారించడంతోపాటు పన్నుల పెంపులు (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ టాక్స్ వంటివి) ఉండడంతో దీనివల్ల సామాన్యులకు ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను భారం పెంచిన మధ్యతరగతి రైతులకు నిరాశే మిగిల్చిందని అన్నారు. రైతు సాయం పీఎం కిసాన్ నిధిని కూడా పెంచలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం ఘోర అన్యాయమని ఆయన మండిపడ్డారు.సాగునీటి, రహదారి, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. , కేంద్ర ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సహకార ఫెడరలిజం స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం రాష్ట్ర అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతోందని హెచ్చరించారు.తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర హక్కుల విషయంలో మౌనంగా ఉన్న బీజేపీ ఎంపీలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకపోవడం సిగ్గుచేటని జావీద్ గారు వ్యాఖ్యానించారు.
Admin
DNB News