Monday, 15 June 2026 01:50:11 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

వికసిత్ భారత్ లక్ష్యసాధనలో యువత పాత్ర అత్యంత కీలకం

Date : 28 February 2026 03:30 PM Views : 65

DNB News - తెలంగాణ / : శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) కరీంనగర్ , కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన "50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి-నేర్చుకోవలసిన పాఠాలు" అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ బృహత్తర సంకల్పమైన వికసిత్ భారత్ 2047 ద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందడంలో యువత అత్యంత కీలక పాత్ర వహిస్తుందనిఉద్ఘాటించారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ,అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని దీనికి పాలకులు, ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తలు ,యువత ,ప్రజలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉపన్యాస పోటీలు విద్యార్థులలోని భావ ప్రకటన, భాషా నైపుణ్యం, ప్రతిభను వెలికి తీస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి నైపుణ్యమే వికసిత్ భారత్ లక్ష్యమని దానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యధిక యువతను కలిగి ఉన్న దేశమని ఇది దేశాభివృద్ధికి ఒక వరం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి 250 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు కళాశాలలో విజేతలైన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో ,అక్కడ గెలిచినవారు జాతీయస్థాయిలో పార్లమెంటులో ప్రసంగిస్తారు. ఎన్.వై కే జిల్లా యూత్ అధికారి వెంకట రాంబాబు మాట్లాడుతూ అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా బహుమతిని అందుకొని కళాశాల కీర్తి ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఎం సత్య ప్రకాష్, సోమ నరసయ్య, డాక్టర్ జి పురుషోత్తం, డాక్టర్ విజయ్ కుమార్, సంతోష్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నితిన్ పాఠక్ ,టి. రాజయ్య , టిజిసిజిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి,వికసిత్ భారత్ నోడల్ జిల్లా అధికారి ఎలిజబెత్ రాణి, పరీక్షల నియంత్రణాధికారి టి. శ్రీనివాస్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ హర్ జ్యోత్ కౌర్,స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాసరెడ్డి ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కాంపల్లి అర్జున్ , డాక్టర్ పడాల తిరుపతి , గుర్రం రాజేందర్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :