Wednesday, 17 June 2026 03:08:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...!

Date : 20 April 2026 05:53 PM Views : 42

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్ఎం పేట గ్రామంలో ఆదివారం మానవతా సేవకు నిలువెత్తు నిదర్శనంగా చలివేంద్రం ప్రారంభమైంది. కీర్తిశేషులు రాయల వెంకట నాగేశ్వరావు జ్ఞాపకార్థం వారి అది ఎప్పుడు కట్టారు కుమారుడు రాయల సతీష్,సాయికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి వేనేపల్లి వీరబాబు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్రమైన దాహార్తితో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ చలివేంద్రం వారికి ఎంతో ఉపశమనాన్ని అందించనుంది. ప్రత్యేకంగా శుభ్రమైన తాగునీరు, చల్లని నీరు అందించే విధంగా సదుపాయాలు కల్పించడం విశేషం. ఈ సందర్భంగా వేనేపల్లి వీరబాబు మాట్లాడుతూ, రాయల వెంకట నాగేశ్వరావు స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు చేపట్టిన ఈసేవాకార్యక్రమం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. అదేవిధంగా రాయల కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ, తమ తండ్రి సేవాభావాన్ని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేసవి కాలమంతా నిరంతరంగా చల్లని తాగునీరు అందించేలా చలివేంద్రాన్ని నిర్వహిస్తామని చెప్పారు. గ్రామస్తులు మాట్లాడుతూ, రహదారి పక్కన ఇలాంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది పెద్ద ఉపశమనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా అక్కడ ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలిశెట్టి బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు లక్య నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు, ఎస్ ఎం పేట వార్డుసభ్యులు రాయల సాయికుమార్, మాజీ వార్డు సభ్యులుకోలా వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,బెల్లంకొండ రామారావు, మొక్క నాగరాజు, కోలా నరసయ్య, మందపల్లి నారాయణరావు, మేడం రాజు, రాయల వెంకట నరసమ్మ, లొడంగి సాయి, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: