DNB News - తెలంగాణ / : జిల్లేపల్లి పెద్ద సైదయ్య మృతి బాధాకరం అని సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అన్నారు. మండల పరిధిలో తాడ్వాయి గ్రామంలో 9 వార్డు లో ఎస్సీ కాలనీ లో జిల్లేపల్లి పెద్ద సైదయ్య ఇటివల కాలంలో అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు.ఆదివారం నిర్వహించిన దశదిన కర్మ సందర్భంగా ఒక క్వింటా బియ్యాన్ని సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య,ఉప సర్పంచ్ వట్యావుల సైదులు, 9 వార్డు మెంబర్ జిల్లేపల్లి సుమన్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సోమపంగు గోపి,జిల్లేపల్లి శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు మచ్చ శంకర్, మాతంగి సైదులు, గురుస్వామి,వినయ్, సతీష్, కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News