Wednesday, 17 June 2026 01:44:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహ-బాద్ మున్సిపాలిటీ లో పాత ఇనుప సామాన్ల కుంభకోణం

Date : 02 February 2026 12:14 PM Views : 63

DNB News - తెలంగాణ / : * వేల రూపాయల ప్రభుత్య సొమ్ము ఇంటి దొంగల పాలు ప్రభుత్వ ఆదాయానికి గండి * కంచే చేను మేసిన చందాగా మహా-బాద్ మున్సిపాలిటీ శానిటరీ జవాన్ తీరు * ఈ జవాను పోస్ట్ ఎక్కడమే వివాదాస్పదం * అక్షర జ్ఞానం లేకున్నా అవినీతి తెలివి తేటలు ఎక్కువే * ఈ జవాను కు అండగా అధికారుల పాత్ర పై అనుమానం * ఇతని వార్డ్ లో హాజరు పట్టికలో హాజరు ఫుల్, బయోమెట్రిక్ లో హాజరు నిల్ * సమగ్ర విచారణ జరుపుతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం. మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మహబూబాబాద్ మున్సిపాలిటీ లో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది, మహ-బాద్ మున్సిపాలిటీ కి సంబందించిన వాహనాలు అయిన చెత్త సేకరించెటి ట్రాక్టర్ లు, ఆటో లు, స్వాచ్ భారత్ రిక్షాలు పాడయి పోయిన మరియు రిపేర్ లు వచ్చిన వాహనాల విడి భాగాలను అన్ని సేకరించి ప్రభుత్వ అనుమతి తో వేలంపాట వేసి వచ్చిన ఆదాయం ప్రభుత్వ ఖజానా లో జమ చేస్తారు, కానీ మన మహబూబాబాద్ మున్సిపాలిటీ లో మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి ఆర్డర్ మరియు తీర్మానం లేకుండా అడ్డదారి లో శానిటరీ జవాన్ పోస్ట్ లోకి వచ్చిన ఒక శానిటరీ జవాన్ మహ-బాద్ టౌన్ లో గల నర్సంపేట రోడ్డు లో స్థూపం దగ్గర గల పాత ఇనుపకొట్టు షాపు లో చెత్త సేకరించే వాహనాల యొక్క విడి భాగాలను అనగా చెత్త ట్రాక్టర్ డోర్ లు, ఆటో డోర్ లు, వాహనాల రిపేర్ చేసిన విడి బాగలు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, దొంగ చాటుగా ది. 01.02.2026 నాడు అమ్ముకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి బారి అవినీతి కి పాల్పడినాడు, ఇతను గతం లో పాడయి పోయిన స్వాచ్చ భారత్ రిక్షాలు వివేకానంద సెంటర్ నుండి అనుమతి లేకుండా అక్రమంగా తరలించి అమ్ముకున్నాడని తోటి శానిటరీ సిబ్బంది మాట్లాడుకుంటున్నాను, ఇంత అవినీతికి పాల్పడుతున్నా సరే, చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఇతన్ని కాపాడుతున్న ఆ అధికారి ఎవరో అని ఇతని అవినీతి బాగోతనికి అధికారుల అండ దండలు ఉన్నాయేమో అని అనుమానం గా ఉంది, ఈ అవినీతి జవాన్ గారు డ్యూటీ కి రాని శానిటరీ సిబ్బంది కి హాజరు పట్టికలో హాజరు వేస్తూ వారి కి పుల్ జీతం చేస్తూ, వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని తోటి సిబ్బంది మాట్లాడుకుంటున్నారు, అధికారులు హాజరు పట్టిక ను మరియు బయోమెట్రిక్ హాజరు ను సరిపోల్చి చూస్తే ఇతని బాగోతం బయట పడుతుంది, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఈ అవినీతి శానిటరీ జవాను పై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన జవాన్ పై క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని, మన మహబూబాబాద్ మున్సిపాలిటీ లో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూడాలని మహబూబాబాద్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: